IFS Officer Sucide : బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్

by M.Rajitha |   ( Updated:2025-03-07 11:54:16.0  )
IFS Officer Sucide : బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్
X

దిశ, వెబ్ డెస్క్ : బిల్డింగ్ మీది నుంచి దూకి ఓ సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సూసైడ్(IFS Officer Sucide) చేసుకోవడం కలకలం సృష్టించింది. శుక్రవారం ఢిల్లీ(Delhi)లోని చాణక్యపూరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విదేశాంగశాఖకు చెందిన ఆఫీసర్ జితేంద్ర రావత్(Jitendra Rawath) వారు నివసించే రెసిడెన్షియల్ సొసైటీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రావత్ కుటుంబంలో ఆయన భార్య, పిల్లలు డెహ్రాడూన్ లో ఉండగా.. ఢిల్లీలో ఆయన తల్లితో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆయన ఈ దారుణానికి ఒడిగట్టారు. గత కొంతకాలంగా రావత్ మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ పోలీసులు మాత్రం ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకాలేదని, ఇప్పుడే వివరాలు ఏమీ చెప్పలేమని తెలియజేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారుల సంఘం.. ఈ కేసులో విచారణలో ఎప్పటికప్పుకడు స్థానిక పోలీసులతో సంప్రదింపులు చేస్తున్నామని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి అన్ని రకాలుగా తాము అండగా ఉంటామని పేర్కొన్నారు.



Next Story

Most Viewed