నాగాలాండ్‌ ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించడంపై.. ఆయనపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు

by Vinod kumar |
నాగాలాండ్‌ ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించడంపై.. ఆయనపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నాగాలాండ్‌లో సీఎం నెఫ్యూ రియోకు మద్దతు ప్రకటించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ శరద్ షాదబ్‌గా మారితే ఆయనను బీటీంగా పిలుస్తారు. సెక్యూలర్లకు అంటరాని వ్యక్తిగా ఉంటారు. నేనెప్పుడూ బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. కానీ, బీజేపీ ఎన్సీపీ మద్దతు ఇవ్వడం ఇది రెండోసారి.. ఇది చివరిది కాకపోవచ్చు’ అని అన్నారు.

తన మంత్రి నవాబ్ మాలిక్‌ను జైలుకు పంపినవారికి పవార్ మద్దతిస్తున్నారని విమర్శించారు. నాగాలాండ్ ప్రజల ప్రయోజనాల మేరకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సీఎం నెఫ్యూ రియో నియామకాన్ని ఆమోదించారు. నాగాలాండ్ ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. ఈ మేరకు పార్టీ అధికార పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. నాగాలాండ్ ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 37 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed