నో చెప్పిన బీజేపీ.. వరుణ్ గాంధీ ఎమోషనల్ లెటర్!

by Hajipasha |
నో చెప్పిన బీజేపీ.. వరుణ్ గాంధీ ఎమోషనల్ లెటర్!
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. తన లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఒక ఎమోషనల్ లెటర్ రాశారు. ‘‘1983లో మూడేళ్ల వయసులో మా అమ్మ వేలు పట్టుకొని ఈ ప్రాంతంలో అడుగుపెట్టడం ఇప్పటికీ నాకు గుర్తే. ఈ ప్రజలంతా నా కుటుంబమే’’ అని అందులో పేర్కొన్నారు. ఎంపీగా పదవీకాలం ముగిసినా.. ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వరుణ్ గాంధీ వెల్లడించారు. ఎంపీగా లేకపోయినా.. ఒక కుమారుడిగా ప్రజలకు సేవ చేస్తానన్నారు. ‘‘సామాన్యుల తరఫున గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఎట్టిపరిస్థితుల్లోనూ అది కొనసాగించేందుకు మీ ఆశీర్వాదం కావాలి’’ అని లేఖలో వరుణ్‌ రాసుకొచ్చారు. పిలిభిత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ పనిచేస్తానని స్పష్టంచేశారు. మరోవైపు, వరుణ్‌ గాంధీ తల్లి మేనకాగాంధీని యూపీలోని సుల్తాన్‌పుర్‌ నుంచి బీజేపీ ఎన్నికల బరిలోకి దింపింది.

Advertisement

Next Story