Pulwama Question : పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు.. జవాన్లు బార్డర్ వదిలేస్తే ఎలా ఉండేది ? : వైద్యులకు టీఎంసీ నేత ప్రశ్న

by Hajipasha |
Pulwama Question : పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు.. జవాన్లు బార్డర్ వదిలేస్తే ఎలా ఉండేది ? : వైద్యులకు టీఎంసీ నేత ప్రశ్న
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా మెడికల్ కాలేజీ ఘటన నేపథ్యంలో బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు వైద్య సంఘాలు, మరోవైపు బీజేపీ నుంచి టీఎంసీ సర్కారు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ సీనియర్ నేత కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘2019 సంవత్సరంలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఆ సమయంలో మిగతా జవాన్లు కూడా సరిహద్దు భద్రతను గాలికొదిలేసి వీ వాంట్ జస్టిస్ నినాదాలతో సమ్మె చేసి ఉంటే ఎలా ఉండేది ? వాళ్లను మనం ఎలా చూసేవాళ్లం ? నిరసనకు దిగుతున్న డాక్టర్లంతా ఈ విషయాన్ని ఓసారి ఆలోచించాలి’’ అని ఆయన సూచించారు. ‘‘సైనికుల్లాగే డాక్టర్లు దేశానికి కీలకం. వాళ్లు వైద్య సేవలను ఆపడం సరికాదు’’ అని కునాల్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed