- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చంద్రుడిపై మరిన్ని చోట్ల మంచు నిక్షేపాలు.. కీలక డేటా సేకరించిన చంద్రయాన్-3

దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2023 ఆగస్టు 23న ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఏ దేశానికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండర్‌ను దింపి.. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. ఇక చంద్రుడి గురించి కీలక విషయాలను ఈ మిషన్ వెల్లడించినట్లు ఇస్రో (ISRO) ఓ జర్నల్‌లో ప్రచురించింది. గతంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా చంద్రుడి ధ్రువప్రాంతాల్లో మరిన్నిచోట్ల మంచు నిక్షేపాలు ఉన్నట్లు చంద్రయాన్-3 గుర్తించినట్లు పేర్కొంది.
ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీస్థాయిలో మార్పుల కారణంగా ఇలా మంచు ఏర్పడుతుందని అహ్మదాబాద్‌లోని సఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీసకి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ మంచు కణాలను పరిశీలించడం ద్వారా చంద్రుడి ప్రారంభ భౌగోళిక చరిత్ర తెలుసుకోవచ్చన్నారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE ప్రోబ్ నమోదు చేసిన చంద్రుడి ఉపరితలం కింద 10 సెంటీమీటర్ల లోతులో తీసిన ఉష్ణోగ్రత రీడింగులను ఆ బృందం విశ్లేషించింది.
అలాగే, ల్యాండర్ దిగిన 'శివ శక్తి పాయింట్' సైట్ వద్ద ఉష్ణోగ్రతలు పగటిపూట 82C నుంచి రాత్రి -170C వరకు ఉంటున్నట్లు అంచనా వేసింది. పరిశోధకులు అభివృద్ధి చేసిన ఒక నమూనా ప్రకారం, సూర్యుని నుండి దూరంగా 14 డిగ్రీల కంటే ఎక్కువ వాలుగా ఉండే ప్రాంతాల్లో శీతల వాతావరణం వల్ల చంద్రుడిపై ఐస్ ఏర్పడుతూ ఉండొచ్చని భావిస్తోంది. నాసా మానవసహిత మిషన్ ఆర్టిమిస్ దిగబోయే దక్షిణ ధ్రువంలో ప్రదేశాలు సహా చంద్రుడి ధ్రువాల వద్ద ఇటువంటి పరిస్థితులే ఉండటం గమనార్హం. చంద్రుడిపై ఉండే మంచు, అక్కడ స్థిర నివాసానికి కచ్చితంగా కీలకమైన వనరుగా ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
అయితే, చంద్రుని అల్ట్రా-హై వాక్యూమ్ వాతావరణం కారణంగా, మంచు.. నీటిలా కరగడానికి బదులుగా నేరుగా ఆవిరిలోకి మారుతోన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ మిషన్ల కోసం చంద్రుడిపై మంచును కరిగించేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేస్తే ఫలితం ఉండొచ్చు. చంద్రునిపై ఉన్న అధిక అక్షాంశ ప్రాంతాలు మంచు నిక్షేపాలకు ఆశాజనకమైన ప్రదేశాలుగా గుర్తించారు. ధ్రువాలతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో ప్రయోగాలు చేయడం అంత కష్టం కాదు. ప్రస్తుతం చంద్రయాన్-3 అందించిన ఈ డేటా ఆధారంగా చండ్రుడిపై భవిష్యత్తులో చేసే ప్రయోగాలకు మరింత ఉపయోగపడనుంది.
Read Also..
Women's Day 2025: స్టార్టప్ క్వీన్స్.. కొత్త ఆలోచనలతో దుమ్మురేపుతున్న మహిళా రాణులు