- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ప్రధాని ఎలా అయ్యాడో?

- రాజీవ్ గాంధీ చదువులో చాలా పూర్
- ఇద్దరం కలిసే చదువుకున్నాం
- మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- వీడియో షేర్ చేసిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చదువుల్లో చాలా వెనుకబడి ఉండేవాడని అయ్యర్ పేర్కొన్నాడు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లలో చదువుకునే సమయంలో రాజీవ్ గాంధీ రెండు సార్లు ఫెయిలయ్యాడని చెప్పారు. రాజీవ్ గాంధీ, మణిశంకర్ అయ్యర్ లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కలిసి చదువుతున్నారు. ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ ప్రధాని అయినప్పుడు.. చదుదులో రెండు సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి ప్రధాని ఎలా అయ్యాడా అని ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ రావడం కంటే ఫెయిల్ అవడమే చాలా కష్టం. ఆ యూనివర్సిటీ ప్రతీ విద్యార్థిని పాస్ చేయించాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వారి యూనివర్సిటీలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉండకుండా రికార్డులు మెయింటైన్ చేస్తుంది. కానీ అలాంటి చోట రాజీవ్ గాంధీ ఫెయిల్ అయ్యాడని మణిశంకర్ అయ్యర్ చెప్పారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి రాజీవ్ గాంధీ.. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు వెళ్లాడు. అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడని మణిశంకర్ అయ్యర్ చెప్పారు. మణిశంకర్ అయ్యర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా పలుమార్లు తన వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలో పెట్టారు. 2014 ఎన్నికలకు ముందు.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ఎప్పటికీ ప్రధాని కాలేడు. ఒక వేళ అతను కావాలనుకుంటే టీ స్టాల్ పెట్టుకోవచ్చు. అందుకు అవసరమైన ఏర్పాట్లు తాను చేస్తానని అన్నారు. కానీ ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికై ఇప్పటికీ కొనసాగుతున్నారు. కాగా, మణిశంకర్ అయ్యర్ వీడియోను బీజేపీ తమ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది. ఆయనను ముసుగు తొలగించనివ్వండి అంటూ అందులో కామెంట్ చేసింది.