- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన పూర్తి.. త్వరలో సర్వీసులు స్టార్ట్
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. తాజాగా అధికారులు ఈ వంతెనను తనిఖీ చేశారు. త్వరలో రైలు రాకపోకలు కూడా ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కశ్మీర్‌లోని దూర ప్రాంతాలు భారత్‌లోని ఇతర నగరాలతో అనుసంధానం అవుతాయి. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్, రియాసి మధ్య కొత్తగా నిర్మించిన రైల్వే లైన్, స్టేషన్లను రైల్వే అధికారులు ఇటీవల విస్తృతంగా తనిఖీ చేశారు. వంతెన పొడవు 1,315 మీటర్లు. చీనాబ్ నది నుంచి 359 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం చేపట్టారు. పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే దాదాపు 30 మీటర్ల కన్న ఎత్తైనది. ఇప్పటివరకు 275 మీటర్లు ఎత్తుతో చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన షుబాయ్ రైల్వే వంతెన పేరు మీద ఉన్న రికార్డును ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో నిర్మించిన వంతెన అధిగమించింది.
దీనిని ప్రపంచంలో ఎనిమిదో వింతగా పేర్కొంటున్నారు. కాశ్మీర్ లోయ అందాలు చూడటానికి, అలాగే, ఎత్తైన కొండలు, లోయల మధ్య ప్రయాణాలు చేయడానికి తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలకు ఈ రైల్వే లైన్ నిర్మాణం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తగా నిర్మించిన వంతెన గురించి రియాసి డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ మాట్లాడుతూ, ఇది ఆధునిక ప్రపంచంలో ఇంజనీరింగ్ అద్భుతం. ఈ వంతెన ప్రపంచంలో ఎనిమిదో వింత, మా ఇంజనీర్లు అద్భుతాన్ని సృష్టించినందుకు మాకు గర్వంగా ఉందని అన్నారు.
అత్యంత ఎత్తైన కొండలు, లోయల మధ్య వంతెన నిర్మాణం చాలా సవాలుతో కూడుకుంది, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా దీనిని నిర్మించాం, ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమైన ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని కొంకణ్ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సుజయ్ కుమార్ అన్నారు.