- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కష్టాల్లో ఉన్నప్పుడు మోడీకి సాయం చేశాను: శరద్ పవార్
దిశ, నేషనల్ బ్యూరో: తన పేరు చెప్పకుండా తాను రైతులకు ఏమీ చేయలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎస్పీ) గురువారం బదులిచ్చారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు(2004-2014) అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి చాలా సహాయం చేశానని, ఆయన రాష్ట్రం గుజరాత్‌లో వ్యవసాయ సంక్షోభం కోసం ఎంతో చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలోని సమస్యలు చెప్పేందుకు తన వద్దకు వచ్చేవాడు. తనను గుజరాత్‌కు కూడా తీసుకెళ్లాడు. ఒకానొక సందర్భంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ తనకు ఫోన్ చేసి ఇజ్రాయెల్‌లోని విశిష్టమైన వ్యవసాయ పద్దతులను అధ్యయనం చేసేందుకు అక్కడికి వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇజ్రాయెల్‌ను సందర్శించాలని కోరినప్పుడు మోడీని కూడా తనతో పాటు తీసుకెళ్లాను. కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ తానేమీ అతని వ్యాఖ్యలను పట్టించుకోనని శరద్ పవార్ అన్నారు. కాగా, బుధవారం ఎన్నికల ర్యాలీలో ప్రధాని మొడీ శరద్ పవార్‌పై విమశలు చేశారు. ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం ఏమీ చేయలేదని, రైతాంగాన్ని పట్టించుకోలేదని, వారి సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.