- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Flood : వరద వలయంలో గుజరాత్‌లోని నవ్‌సారి

X
దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నవ్‌సారి నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల పునరావాసం కోసం తాత్కాలిక షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన దాదాపు 110 మందికి వీటిలో ఆశ్రయం కల్పించారు. ఆనంద్ జిల్లాలోని బోర్సాస్ ఏరియాలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ సందర్శించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 61కి చేరిందని ఆయన వెల్లడించారు.
Next Story