- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Health Bulletin: సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. హెల్త్ బులిటిన్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దుండగుడు దాడి చేసిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో సైఫ్ శరీరంతపై మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆయను చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రి (Lilavati Hospital)కి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఆరోగ్య పరిస్థితిపై తాజాగా, హెల్త్ బులిటిన్ (Health Bulletin) విడుదల చేశారు. సైఫ్‌కు న్యూరో (Neuro), ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery)లు చేశామని.. ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. మెడ, వెన్నుముక నుంచి రెండున్నర ఇంచ్‌ల కత్తిని బయటకు తీసి గాయాలకు సర్జరీ చేశామని, ఫ్లూయిడ్ లీకేజీ (Fluid Leakage)ని నియంత్రించామని అన్నారు. అదేవిధంగా సైఫ్‌పై పదునైన ఆయుధంతో దాడి జరిగిందని, అతడి వెన్నుముక చాలా డ్యామేజ్ అయిందని అన్నారు. సర్జరీ జరిగిన వెంటనే మళ్లీ అతడిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూ (ICU)కి షిఫ్ట్ చేశామని తెలిపారు.
Read More : Attack on Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి ఇంట్లోవారి పనేనా?