Ayodhya: అయోధ్య ఆలయ ప్రధాని పూజారికి తీవ్ర అస్వస్థత

by Shamantha N |   ( Updated:2025-02-03 16:44:33.0  )
Ayodhya: అయోధ్య ఆలయ ప్రధాని పూజారికి తీవ్ర అస్వస్థత
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ (Satyendra Das)(85) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లక్నోలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. సత్యేంద్ర దాస్‌ మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆదివారం ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే, అందిస్తున్న వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్‌ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులోనే నిర్వాణి అఖాడాలో చేరారు. అప్పట్నుంచి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.



Next Story

Most Viewed