- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా ? నిర్మలమ్మ రికార్డులివీ
దిశ, నేషనల్ బ్యూరో : మనదేశ చరిత్రలో ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి ఎవరో తెలుసా ? మొరార్జీ దేశాయ్ !! ఆయన మొత్తం 10 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1959-60 నుంచి 1963-64 మధ్య కాలంలో ఆయన ఐదు పద్దులను పార్లమెంట్ ముందుంచారు. ఇక అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డును క్రియేట్ చేశారు. తాజాగా గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కలుపుకుంటే.. ఇప్పటివరకు ఆమె పార్లమెంటు ముందు ఉంచిన బడ్జెట్ల సంఖ్య ఐదుకు చేరింది. మహిళా ఆర్థిక మంత్రిగా ఇలా ఐదు సార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన వారు ఇంకెవ్వరూ లేరు.మాజీ ప్రధానమంత్రి ఇంధిరా గాంధీ కూడా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరనే. ఇంధిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇందిరమ్మ కంటే నిర్మలమ్మే ఎక్కువ సార్లు(ఐదు సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం సీతారామన్‌కు ఆర్థికశాఖ బాధ్యతల్ని అప్పగించింది. సంప్రదాయంగా వస్తున్న బ్రీఫ్‌కేస్ విధానాన్ని పక్కనపెట్టి ‘బాహీ- ఖాతా’గా పిలిచే వస్త్రంతో కూడిన ఎరుపు రంగు సంచిలో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకొచ్చే ఆనవాయితీని నిర్మల ప్రారంభించారు.
ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది వీరే..
* ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రుల జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు.
* ఫిబ్రవరి చివరి రోజు నుంచి నెల ఆరంభానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే కొత్త సంప్రదాయాన్ని అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌లోనూ అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* పి.చిదంబరం 2004-05 నుంచి 2008-09 వరకు వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రి హోదాలో యశ్వంత్ సిన్హా 1998-99 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈయన హయాంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు.
* పీ.వీ. నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.