- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Chai wale Baba: నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడు.. కానీ, కొన్నేళ్లుగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాడు.. అతనెవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు వందలు పెట్టిన చదువుకి ఇప్పుడు లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఇక సివిల్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ఇచ్చే కోచింగ్ కు డబ్బులు పోయాల్సిందే. అయితే, ఓ వ్యక్తి బాబా మారి సన్యాసం తీసుకుని IASకి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు. అందరూ ‘చాయ్‌వాలే బాబా (Chai Wale Baba)’గా పిలిచే అతని పూర్తి పేరు దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి.
ఇతనికి సంబంధించిన ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆయన ఎలాంటి ఆహారం తినరు. కేవలం రోజుకు 10 కప్పుల చాయ్ మాత్రమే తాగుతారు. అందుకే, ఆయన్ని చాయ్‌వాలే బాబాగా పిలుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయన ఇదే ఫాలో అవుతున్నారు.
‘‘నేను బాబాతో ఐదేళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నాను. మేమంతా ఆయన స్టూడెంట్స్. ఎప్పుడు, ఏ సహాయం కావాలన్నా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తారు. కేవలం సైగలు, సంకేతాలు, వాట్సప్ మెసేజ్‌ల ద్వారా మమ్మల్ని గైడ్ చేస్తారు. మాకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేస్తే చాలు, వెంటనే ఆన్సర్ కి రిప్లై ఇస్తారు. నోట్స్ కూడా వాట్సప్ ద్వారానే అందరికీ పంపుతారు’’ అని ఓ విద్యార్థి వెల్లడించారు.సొంతంగా పరీక్షలకు ప్రిపేర్ అయి జాబ్ కొట్టే సత్తా కొద్దీ మందిలోనే ఉంటుంది. కానీ, అలాంటి వారికి కూడా సమయం పడుతుంది. అలాంటిది అత్యున్నత స్థాయి ఉద్యోగానికి అవసరమయ్యే కోచింగ్‌ను ఫ్రీగా అందించడమంటే గొప్ప విషయం. దీనిపై రియాక్ట్ అయిన చాయ్‌వాలే బాబాకు ‘సెల్యూట్ చేయాల్సిందే’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.