రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కపూట పని

by Mahesh |   ( Updated:2023-04-08 14:39:20.0  )
రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం..  ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కపూట పని
X

దిశ, వెబ్ డెస్క్: వేసవికాలంలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్క పూట పనిచేయనున్నట్లు శనివారం సీఎం భగవంత్ మాన్ తెలిపారు. వేసవికాలంలో ఉదయం 7.30 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. విద్యుత్ డిమాండ్ ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన చెప్పారు. ఈ మేరకు మే 2 నుంచి జూలై 15 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొత్త సమయ పాలన నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారుగా 300 మెగా వాట్ల నుంచి 350 మెగా వాట్ల పీక్ లోడ్ ఆదా అవుతుందని విద్యుత్ శాఖ వెల్లడించనినట్లు మాన్ తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడమే కాకుండా, సమయానుకూలంగా సేవలు అందిస్తారని చెప్పారు. విదేశాల్లోనూ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తూ విద్యుత్‌ను ఆదా చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story