- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్ఞానవాపి మసీదు కాదు.. జ్యోతిర్లింగం! UP CM సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు వ్యవహారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి మసీదు కాదన్నారు. అది ఓ జ్యోతిర్లింగం అని చెప్పారు. జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం అవుతుందని వ్యాఖ్యానించారు. ఏఎన్ఐతో మాట్లాడిన యోగి ఆదిత్యానాథ్.. జ్ఞానవాపి మసీదు ఆవరణలో త్రిశూలం, దేవుడి ప్రతిమలు ఉన్నాయన్నారు. జ్ఞానవాపి విషయంలో చారిత్రాత్మక తప్పు జరిగిందని ముస్లింలు అంగీకరించి జ్ఞానవాపిని తిరిగి అప్పగించాలన్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతిపాదనను ముందుకు తీసుకురావాలన్నారు. జ్ఞాన్‌వాపి మసీదును అంతకు ముందే ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని తెలుసుకునేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే చేపట్టే విషయంలో అలహబాద్ హైకోర్టు ఆగస్టు 3న తీర్పు వెలువరించబోతున్నది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు దుమారంగా మారాయి.