ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ

by Harish |
ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. జిల్లాలోని మురాద్ నటర్ ఈస్టర్న్‌ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే పై రేవారి రేవాడ గ్రామ సమీపంలో రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సోనిపట్ జిల్లా హర్యానా నుంచి హర్దోయికి ఇటుక బట్టీ కార్మికులను ఎక్కించుకుని వెళ్తున్న డీసీఎం వ్యాను పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే దగ్గరకు రాగానే దానిలో ఉన్న వ్యక్తులు మూత్రవిసర్జన కోసం వాహనాన్ని ఆపాలని డ్రైవర్‌ను కోరగా, అతను హై వే ప్రక్కన ఆపాడు, ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీ డీసీఎంను ఢీకొట్టడంతో అది బోల్తా పడింది.

ఈ వాహనంలో మహిళలు, పిల్లలు సహా మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నారు. చనిపోయిన నలుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే, గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రికి పంపారు. డీసీఎంలో ఉన్నవారంతా కూడా హర్దోయ్ నివాసితులు. వారంతా కూడా ఇటుక బట్టీల్లో పనిచేస్తారు.

Advertisement

Next Story

Most Viewed