భారీ శబ్దంతో పేలిపోయిన 50 గ్యాస్ సిలిండర్లు.. వీడియో వైరల్

by Mahesh |   ( Updated:2025-02-04 12:29:42.0  )
భారీ శబ్దంతో పేలిపోయిన 50 గ్యాస్ సిలిండర్లు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: శని తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం(fire hazard)లో భారీ శబ్దంతో ఏకంగా 50 గ్యాస్ సిలిండర్లు (50 gas cylinders) పేలిపోయాయి (Exploded). ఈ భీకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ (Ghaziabad) లోని ఢిల్లీ-వజీరాబాద్ రోడ్‌లోని భోపురా చౌక్ వద్ద చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటలు ట్రక్కులో ఉన్న సిలిండర్లకు అంటుకోవడంతో ఒక్కొక్కటిగా 50 గ్యాస్ సిలిండర్లు తేలిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. అయితే భారీ పేలుడు కారణంగా ట్రక్ నుంచి ఎగిరిపోయిన కొన్ని సిలిండర్లు వందల మీటర్ల దూరంలో ఎగిరపడటంతో స్థానికంగా ఉన్న వాహనాలు డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా శనివారం (Saturday) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడం, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగనట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters) సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికి.. ట్రక్కులో ఉన్న సిలిండర్లు పేలుతూనే ఉండటంతో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు (Gas cylinders Truck) వద్దకు చేరుకోలేక పోయినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ కుమార్ తెలిపారు. పేలుళ్ల శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. పేలుడు కారణంగా దూరంగా ఎగిరిపడ్డ గ్యాస్ సిలిండర్లు.. ఒక చెక్కల గోదామ్ తో పాటు మరో ఇంటిని కూడా దహనం చేసిన్టులు స్థానికులు తెలుపుతున్నారు.

ఈ ప్రమాదంపై స్థానిక కౌన్సిలర్ ఓం పాల్ భట్టి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3.30 గంటలకు ట్రక్కులో అంటుకోవడంతో చెలరేగాయి. మొదట భారీ శబ్దం (loud noise) తో ఓ పేలుడు జరిగింది. అనంతరం వరుసగా గ్యాస్ సిలిండర్లు పేలడం (exploding) మేము గమనించాము. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమయానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.


Click Here Tweet..


Next Story

Most Viewed