- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం: డీకే శివకుమార్

X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కనకపుర నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేడు యువతకు గొప్ప అవకాశం వచ్చిందని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ధరల పెరుగుదల గురించి వారికి బాగా తెలుసన్నారు. యువత రాష్ట్రంలో అధికార మార్పు కోరుకుంటోందని, ఇందుకు అనుగుణంగానే వారు ఓటు వేస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తమకు 141 సీట్లు ఇస్తారని చెప్పారు. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం తనకుందని డీకే శివకుమార్ తెలిపారు.
Also Read...
పాన్ పరాగ్ తినే తలసాని నా గురించి మాట్లాడుతాడా.? రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Next Story