Malayalam Actor : పోర్న్ వీడియోలు చూడమని బలవంతం చేశారు.. డైరెక్టర్‌‌పై నటి మిను మునీర్ ఆరోపణ

by Hajipasha |
Malayalam Actor : పోర్న్ వీడియోలు చూడమని బలవంతం చేశారు.. డైరెక్టర్‌‌పై నటి మిను మునీర్ ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ సంచలన ఆరోపణలు చేశారు. తమతో కలిసి కూర్చొని గ్రూప్ సెక్స్‌కు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడమని డైరెక్టర్‌ బాలచంద్ర మీనన్ బలవంతం చేశారని ఆమె ఆరోపించారు. అయితే అలాంటి వీడియోలను చూడనని తేల్చి చెప్పి, తాను గది నుంచి బయటికి వచ్చానన్నారు. తాను బయటికి వచ్చే సమయానికి గదిలో డైరెక్టర్‌తో పాటు ముగ్గురు యువతులు కూర్చొని గ్రూప్ సెక్స్ పోర్న్ వీడియోలను చూడటం తనకు ఇప్పటికీ గుర్తుందని మిను మునీర్ పేర్కొన్నారు. 2007 సంవత్సరంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో మిను మునీర్ తనకు ఎదురైన కష్టాలను వివరించారు.

‘‘నేను మూవీ ఇండస్ట్రీలోకిి ఎన్నో కలలతో వచ్చాను.. కానీ ఆ ఇండస్ట్రీ నాకు పీడకలలను మిగిల్చింది’’ అని ఆమె పేర్కొన్నారు. హేమ కమిటీ నివేదిక సినీ పరిశ్రమకే కాకుండా యావత్ సమాజ ప్రక్షాళనకు బాటలు వేసిందని కొనియాడారు. ‘‘2013 సంవత్సరంలో నేను ఒక మూవీ కోసం పనిచేస్తుండగా శారీరకంగా, మాటలతో వేధించారు. అయినా సహనంతో ఆ మూవీ కోసం పనిచేశాను. వేధింపులు మితిమీరడంతో నేను తట్టుకోలేకపోయాను. అందువల్లే మలయాళం మూవీ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయాను’’ అని మిను మునీర్ చెప్పారు. ఇటీవలే ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story