- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Flight Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: వర్జీనియా (Virginia) రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరువక ముందే అమెరికా (America)లో మరో ఫ్లైట్ కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా (Philadelphia)లో మినీ విమానం టేకాఫ్ అవుతుండగానే గాలిలోనే పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విమాన శకలాలు సమీపంలోని ఇళ్లపై చల్లాచదురుగా పడిపోయాయి. ఫ్లైట్‌లో ఇద్దరు పైలట్లతో సహా ఇద్దరు డాక్టర్లు, ఓ పెషెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
64 మంది దుర్మరణం
కాగా, బుధవారం తెల్లవారుజామున వర్జీనియా (Virginia) రాష్ట్రంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయానికి (Ronald Reagan Washington National Airport) సిబ్బందితో కలిపి 64 మందితో ఓ విమానం ల్యాండ్ అవుతోంది. ఇదే సమయంలో ఫ్లైట్ పోటోమాక్ నది (Potomac River) సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ మిలటరీ హెలికాప్టర్ (Military Helicopter) ఆ ప్యాసింజర్ ఫ్లైట్ (Passenger Flight)ను బలంగా ఢీకొట్టింది. దీంతో విమాన శకలాలు పొటోమాక్ నదిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దుర్ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 64 మంది ప్రాణాలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు (Ronald Reagan Airport) ల్యాండింగ్ ట్రాక్‌కు సమీపంలోనే విమానం కూలిపోయిందని అధికారిక వర్గాలు కూడా ధృవీకరించాయి. రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ నుంచి అన్ని విమానాల టేకాఫ్స్ (Take Offs), ల్యాండింగ్స్ (Landings)ను తాత్కాలికంగా నిలిపివేసి తిరిగి రీ ఓపెన్ చేశారు.