- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఇద్దరు దంపతులు, ఒక మహిళ మృతి
దిశ, నేషనల్ బ్యూరో: చేతబడి చేస్తున్నారనే నెపంతో గ్రామస్తులు దాడి చేయగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గడ్‌లో గిరిజనులు అధికంగా ఉండే సుక్మా జిల్లాలోని ఏక్తాల్ గ్రామంలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది ఒక ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరు దంపతులు, ఒక మహిళను కర్రలతో ఇష్టం వచ్చినట్లు తీవ్రంగా కొట్టడంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మృతులను మౌసం కన్న- అతని భార్య మౌసం బీరీ, మౌసం బుచ్చా-అతని భార్య మౌసం అర్జో, మరో మహిళ కర్కా లచ్చిగా గుర్తించారు. వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు.
గ్రామంలో ఇటీవల కాలంలో పలువురు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం, పిల్లలకు కూడా ఇలాగే జరుగుతుండటంతో దీనికి కారణం ఆ కుటుంబం వారు చేతబడి చేస్తున్నారని అనుమానించిన గ్రామస్తులు వారిపై దాడి చేసి చంపారు. దాడి చేస్తున్న సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారంతా మృతి చెందారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితులు.. సవ్లాం రాజేష్ (21), సవ్లాం హిద్మా, కారం సత్యం (35), కుంజం ముఖేష్ (28), పొడియం ఎంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ, తమ వారికి చేతబడి చేస్తున్నారనే అనుమానంతో నిందితులు వారిపై దాడి చేసినట్లు తెలిపారు. ఆ ఐదుగురిని కూడా చనిపోయే వరకు కొట్టారని వారందరూ అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై విచారణ జరుగుతుంది.