అసోం నుంచే అతి తక్కువ దరఖాస్తులు: సీఎం హిమంత బిస్వశర్మ

by samatah |
అసోం నుంచే అతి తక్కువ దరఖాస్తులు: సీఎం హిమంత బిస్వశర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత పౌరసత్వం కోసం అసోం నుంచే అతితక్కువ దరఖాస్తులు ఉంటాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వ శర్మ చెప్పారు. రాష్ట్రంలో సీఏఏ తక్కువగానే ఉంటుందని చెప్పారు. గురువారం ఆయన గువహటిలో మీడియాతో మాట్లాడారు. అసోంలో సీఏఏ ముఖ్యమైంది కాదని..పోర్టల్‌లో అత్యల్పంగానే అప్లికేషన్స్ ఉంటాయని అంచనా వేశారు. ‘పౌరసత్వ దరఖాస్తుకు కటాఫ్ తేదీ 2014 డిసెంబర్ 31 అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) అప్‌డేషన్‌తో, దాని కోసం దరఖాస్తు చేసిన, చేయని వ్యక్తులు ఆ జాబితాలో వారి పేర్లు ఉంటే సీఏఏకి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని14 లోక్‌సభ స్థానాలకు గాను 13 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వ్యక్తుల నుంచి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story