- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కనికరం లేకుండా చిన్నారులను చితక్కొట్టిన మహిళా ఆఫీసర్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: ఇద్దరు చిన్నారులపై ఓ మహిళా ఉద్యోగి క్రూరత్వం ప్రదర్శించింది. జట్టు పట్టుకొని చితక్కొడుతూ.. మంచంపై ఎత్తేసి హింసిస్తూ.. ఆ పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగుచూసింది. అనాథలైన 6 సంవత్సరాలలోపు చిన్నారులకు కాంకేర్ జిల్లాలోని అడాప్షన్ సెంటర్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే అక్కడ పనిచేసే ప్రోగ్రాం మేనేజర్ సీమా ద్వివేది చిన్నారుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఓ ఇద్దరు చిన్నారులను మానసికంగా హింసించి.. జుట్టు పట్టుకుని చితక్కొట్టింది. అనంతరం వారిని మంచంపై ఎత్తేసింది.
ఈ దారుణ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పిల్లలపై దాడి చేసిన సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు ఉద్యోగులు కూడా ద్వివేదిని అడ్డుకోలేదు. అయితే తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు కాంకేర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక శుక్లా సీరియస్‌గా స్పందించారు. అడాప్షన్ సెంటర్ ప్రోగ్రాం మేనేజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. గతంలో ఆ సెంటర్ ఉద్యోగులు సీమ ద్వివేది ప్రవర్తన బాగాలేదని, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సీమా ద్వివేదిపై జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
छत्तीसगढ़ के आदिवासी बहुल कांकेर जिले स्थित प्रतिज्ञा विकास संस्थान में महिला मैनेजर सीमा द्विवेदी द्वारा अनाथ बच्चों को पीटने का वीडियो बेहद शर्मनाक है। जिसमें वह मासूम बच्चों को बाल पकड़कर बेरहमी से जमीन पर पटकती नजर आ रही है। यह गंभीर अपराध है। सीमा द्विवेदी को कड़ी सजा मिले। pic.twitter.com/TzFNMoW788
— Hansraj Meena (@HansrajMeena) June 5, 2023