NC chief Farooq Abdullah: ఆ దేశాలు మూడో ప్రపంచ యుద్ధం లేకుండా చూడాలి..

by vinod kumar |
NC chief Farooq Abdullah: ఆ దేశాలు మూడో ప్రపంచ యుద్ధం లేకుండా చూడాలి..
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని పెద్ద దేశాలు మూడో ప్రపంచ యుద్ధం తలెత్తకుండా చూస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మీడియాతో మాట్లాడారు. ఘర్షణలో ఇరు వైపులా ప్రజలు చంపబడ్డారని, మానవత్వం చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా కొనసాగుతోందని మానవాళిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచ శాంతి కోసం తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. అలాగే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎన్సీ కూటమి విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే గెలుపు ఖాయమైందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే మిగిలి ఉందన్నారు.

Next Story

Most Viewed