- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో రైతుల ఆందోళన: 200 మంది అరెస్టు!
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అధారిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. వందలాది మంది రైతులు నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద నుంచి పార్లమెంటు ముట్డడికి బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతుల బ్యారీ కేడ్లను తొలగించి ముందుకు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగగా.. 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతుల నిరసనలతో ఢిల్లీలోని పలు హైవేలపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తమ కుటుంబాలకు మెరుగైన పునరావాస సౌకర్యాలు కల్పించడంతో పాటు, భూపరిహారాన్ని పెంచాలని నోయిడాలోని గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, 81 గ్రామాలకు చెందిన భూముల్లో ఏర్పాటైన నోయిడా అథారిటీ..1997 నుంచి 2014 మధ్య కాలంలోభూములకు సేకరించింది. ఈ క్రమంలో 16 గ్రామాల రైతులకు మాత్రమే పరిహారం అందించారు. దీంతో మిగిలిన గ్రామాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వారి డిమాండ్లను పరిశీలించాలని హైకోర్టు నోయిడా అథారిటీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల తర్వాత, ప్లాట్లు లేదా దాని విస్తీర్ణంలో10 శాతానికి సమానమైన పరిహారం ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే కొందరు రైతులను మాత్రమే అందులో చేర్చారని మిగిలిన వారిని కూడా చేర్చి సరైన పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నోయిడా అథారిటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది.
యూపీ ప్రభుత్వం నిర్లక్యం వహిస్తోంది: కిసాన్ ఏక్తా సంఘ్ నేత సుఖ్‌బీర్ యాదవ్
నివాస అవసరాల కోసం సేకరించిన మొత్తం భూమిలో 10శాతం, 64.7శాతం పెంచిన భూ పరిహారం, రెసిడెన్షియల్ ప్లాట్‌లపై వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి, ఇతర ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నట్టు భారతీయ కిసాన్ ఏక్తా సంఘ్ నాయకుడు సుఖ్‌బీర్ యాదవ్ అన్నారు.ఈ డిమాండ్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని తెలిపారు.