- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దేశం విడిచి వెళ్లిపోండి

- విదేశీ విద్యార్థులకు మెయిల్స్
- లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- అమెరికాలో ఆందోళన చెందుతున్న విద్యార్థులు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో చదువుతున్న వందలాది మంది విదేశీ విద్యార్థులకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి ఈమెల్స్ వచ్చాయి. క్యాంపస్‌లో జరిగే ఆందోళనల్లో పాల్గొన్నందుకు గాను వారి ఎఫ్-1 వీసాలు రద్దు చేయబడ్డాయని.. కాబట్టి సదరు విద్యార్థులందరూ తమంతట తామే దేశం వదిలి వెళ్లిపోవాలని ఈ-మెయిల్స్‌లో హెచ్చరించారు. విద్యార్థులు సెల్ఫ్ డీపోర్టేషన్ చేసుకోకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్యాంపస్ ఆందోళనల్లో నేరుగా పాల్గొన్న విద్యార్తులే కాకుండా.. యాంటీ-నేషనల్ పోస్టులను లైక్, షేర్ చేసిన విద్యార్థులకు కూడా ఈ-మెయిల్స్ వచ్చినట్లు తెలిసింది. వీరిలో కొంత మంది భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిసింది. కొంత మంది భారతీయ విద్యార్థులు సోషల్ మీడియా పోస్టులను షేర్ చేసినట్లు ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు తెలిపారు.
ఓపెన్ డోర్స్ తాజా నివేదిక ప్రకారం 2023-24లో అమెరికాలో చదువుతున్న 1.1 మిలియన్ల విదేశీ విద్యార్థుల్లో 3.31 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దేశ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందున విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కోరూబియో ప్రకటించిన తర్వాతే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇలా ఎప్-1 వీసాలు రద్దు అయిన విద్యార్థులు 300 కంటే ఎక్కువ ఉండ వచ్చని రూబియో తెలిపారు. ప్రపంచంలోని ప్రతీ దేశానికి ఎవరు సందర్శకుడిగా వస్తారో, ఎవరు రాకూడదో నిర్ణయించుకునే హక్కు ఉందని రూబియో తెలిపారు.
రద్దు చేయబడిన 300 వీసాల్లో విద్యార్థి వీసాలతో పాటు టూరిస్ట్ వీసాలు కూడా ఉన్నట్లు తెలిపారు. హమాస్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న విద్యార్థులను గుర్తించి వారి వీసాలను రద్దు చేయడానికి ఇటీవల క్యాచ్ అండ్ రీవోక్ అనే ఏఐ ఆధారిత యాప్‌ను అమెరికా ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా డీవోఎస్ అధికారులు కొత్త విద్యార్థుల దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో ఎవరైనా దోషులుగా తేలితే యూఎస్‌లో చదువుకునే అవకాశం నిరాకరించబడుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు, టూరిస్టులు వెంటనే అమెరికాను వదిలి స్వచ్ఛంధంగా వెళ్లిపోవాలని..లేకుంటే వారిని బలవంతంగా డీపోర్ట్ చేస్తామని, అలాగే భారీ జరిమానాలు కూడా విధిస్తామని అమెరికా అధికారులు హెచ్చరించారు. అయితే బహిష్కరించబడిన విద్యార్థులు భవిష్యత్‌లో అమెరికాకు తిరిగి రావాలనుకుంటే కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. వారి అర్హతను తిరిగి అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.