మాజీ సీఎంలపై దేవగౌడ తీవ్ర ఆరోపణలు

by S Gopi |
మాజీ సీఎంలపై దేవగౌడ తీవ్ర ఆరోపణలు
X

బెంగళూరు: ఎన్నికలకు కర్ణాటక సిద్ధమవుతున్న వేళ మాజీ ప్రధాని, జేడీ(ఎస్) నేత హెచ్‌డి దేవగౌడ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కీలకమైన వరుణ సీటుపై మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, సిద్ధరామయ్య మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరిందని అన్నారు. వరుణ నియోజకవర్గంలో తన కుమారుడు పోటీ చేయడంలేదని బీజేపీ నేత యడియూరప్ప ఎందుకు ప్రకటించారని దేవ గౌడ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఎంతో బలమున్న ఆ నియోజకవర్గంలో సిద్ధరామయ్య పోటీ చేస్తున్నారు.. ‘దీని అర్థమేంటి? సింపుల్‌గా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రుల మధ్య వ్యూహాత్మక అవగాహన ఉంది’ అని దేవెగౌడ్ అన్నారు. దీనిని బీజేపీ నేతలు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. హస్సన్ టికెట్ వివాదంపై కూడా మాజీ పీఎం స్పందించారు. దాని గురించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అది తన సొంత జిల్లా.. అంతా తాను చూసుకుంటానని చెప్పారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో పొత్తుపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘మేమెలా చేయగలం? ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం, కాంగ్రెస్ మాజీ సీఎంల మధ్య అవగాహన ఉంది. ఇంతకంటే ఏం చెప్పగలను?’ అని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత దేవగౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కర్ణాటకలో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13వ తేదీన వెలువడుతాయి.

Advertisement

Next Story

Most Viewed