- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
EPFO: యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేషన్ గడువు పొడిగించిన ఈపీఎఫ్ఓ..!
దిశ, వెబ్‌డెస్క్: ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)కు సభ్యులైన ఉద్యోగులందరి యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN) యాక్టివేషన్(Activation)లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన వారి యూఏఎన్ యాక్టివేషన్(UAN Activation)కు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ అకౌంట్(Bank Account)తో ఆధార్ సీడింగ్(Aadhaar Seeding)కు సంబంధించి గడువును మరో 15 రోజులు పొడిగించింది. కాగా ఇందుకు సంబంధించిన గడువు నవంబర్ 30తో ముగియగా.. తాజాగా దాన్ని డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ 'ఎక్స్(X)' వేదికగా ఓ పోస్ట్ చేసింది.
యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే ఏంటి..!
యూఏఎన్ అనేది ఉద్యోగి మొదటి సారి ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరినప్పుడు ఆటోమాటిక్(Automatic)గా క్రియేట్ అవుతుంది. ఎన్ని కంపెనీలు మారిన యూఏఎన్ ఒకటే ఉంటుంది. కొత్త కంపెనీలో జాయిన్ అయిన టైంలో ఉద్యోగి తప్పని సరిగా సంస్థ యజమానికి తమ యూఏఎన్ నంబర్ ను అందించాలి. అప్పుడు ఈపీఎఫ్ఓ కొత్త ధ్రువీకరణ ఐడీ ని కేటాయిస్తుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్ తో లింక్ అవుతుంది. అలాగే ఉద్యోగి ఈపీఎఫ్ఓ సర్వీసులు పొందాలంటే యూఏఎన్ తో ఆధార్ నెంబర్(Aadhaar Number) కేవైసీ లింక్(KYC Link) చేయాల్సి ఉంటుంది.