Engineer rashid: తిహార్ జైలుకు ఇంజనీర్ రషీద్.. ముగిసిన మధ్యంతర బెయిల్ గడువు

by vinod kumar |
Engineer rashid: తిహార్ జైలుకు ఇంజనీర్ రషీద్.. ముగిసిన మధ్యంతర బెయిల్ గడువు
X

దిశ, నేషనల్ బ్యూరో: అవామీ ఇత్తెహాద్ పార్టీ (Awami Ittehad Party) చీఫ్, బారాముల్లా(Baramullah) ఎంపీ ఇంజనీర్ రషీద్ (Engineer rashid) ఢిల్లీలోని తిహార్ జైలు(Tihar Jail)లో లొంగిపోయారు. ఆయనకు ముంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు సోమవారంతో ముగియగా జైలు అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. కశ్మీర్ (Kashmir) నుంచి ఉదయం ఢిల్లీకి వచ్చిన రషీద్ మధ్యాహ్నం12గంటలకు లొంగిపోయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, టెర్రర్ ఫండింగ్ కేసు(Terrar Funding case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్‌ను 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ(NIA) అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉండగా అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliemnt elections) పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ (Jammu Kashmir Assembly Elections) ఎన్నికల ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్‌ రాగా బయటకు వచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 9న మధ్యంతర బెయిల్‌ను అక్టోబర్ 15 వరకు పొడిగించారు. అనంతరం మరోసారి విజ్ఞప్తి చేయగా న్యాయస్థానం అక్టోబర్ 28 వరకు గడువు పెంచింది. ఈ క్రమంలోనే గడువు ముగియడంతో ఆయన జైలులో లొంగిపోయారు. మరోవైపు రషీద్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ కోర్టు (delhi court) నవంబర్ 19కి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed