తమిళనాడులో రౌడీషీటర్ల ఎన్‌కౌంటర్

by Mahesh |
తమిళనాడులో రౌడీషీటర్ల ఎన్‌కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని చెన్నై సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు రౌడీషీటర్లు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ముత్తు శరవణన్, సతీష్ అనే ఇద్దరు దోపిడీలు, దొంగతనాలు చేసే పేరు మోసిన రౌడీషిటర్లు.. ఆగస్టు 17న హత్యకు గురైన ఏఐఏడీఎంకే నాయకుడు పార్థిబన్ హత్యతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆవడి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు బృందం చోళ వరం సమీపంలో వీరిద్దరిని చుట్టుముట్టింది. ముత్తు శరవణన్, సతీష్ తమపై దాడికి ప్రయత్నించారని, దీంతో కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల్లో ముత్తు శరవణన్ అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్‌ను ఆసుపత్రికి తరలించగా అతను మరణించాడు.

Next Story