- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ పథకం సూత్రధారి ప్రధాని మోడీయే : రాహుల్ గాంధీ
by Hajipasha |

X
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకమని, దీని ప్రధాన సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ఎలక్టోరల్ బాండ్‌పై ముఖ్యంగా ఉండేవి దాతల పేర్లు, విరాళం ఇచ్చిన తేదీలు. మోడీ ప్రభుత్వం ఈ రెండు వివరాలను చూసి.. బీజేపీకి విరాళమిచ్చిన కంపెనీలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్లకుండా ఆపించేది’’ అని ఆయన పేర్కొన్నారు. కేరళలోని వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి విరాళాలు ఇచ్చిన కంపెనీలకు.. తదుపరిగా కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. పార్టీకి ప్రయోజనకరంగా ఉండేలా ఎన్నికల బాండ్ల స్కీంను వాడుకోవడం దారుణమని పేర్కొన్నారు.
Next Story