మహా సీఎం కీలక ప్రకటన.. రాష్ట్ర గీతంగా 'జై జై మహారాష్ట్ర మహ్జ'

by Hajipasha |   ( Updated:2023-01-31 12:52:37.0  )
మహా సీఎం కీలక ప్రకటన.. రాష్ట్ర గీతంగా జై జై మహారాష్ట్ర మహ్జ
X

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 'జై జై మహారాష్ట్ర మహ్జ'‌ను రాష్ట్ర గీతంగా మంగళవారం ప్రకటించింది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 19 నుంచి అమల్లోకి తీసుకొస్తామని పేర్కొంది. సీఎం ఏక్‌నాథ్ షిండే అధ్వర్యంలోని రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గీతం మరాఠీ ఐకానిక్ పాటల్లో ఒకటిగా ఉంది. ఈ పాట మహారాష్ట్ర ఘనతను కీర్తిస్తూ ఉంటుంది. దీనిని రాజా బధే రాయగా బల్లబీర్ కృష్ణారావు సబుల్ ఆలపించారు.



Next Story

Most Viewed