Education: విద్యలో ఏఐ ఉపయోగం.. రూ.500 కోట్లు కేటాయించిన కేంద్రం

by vinod kumar |
Education: విద్యలో ఏఐ ఉపయోగం.. రూ.500 కోట్లు కేటాయించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై పలు కీలక ప్రకటనలు చేసింది. నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చింది. విద్యా రంగానికి మొత్తం రూ.1,28,650 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 6.65శాతం ఎక్కువ. అంతకుముందు ఏడాది రూ.1.48లక్షల కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఉన్నత విద్యకు రూ.50,057 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 78,572 కోట్లుగా ప్రకటించారు. వీటితో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రామీణ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ లెర్నింగ్ కోసం భారతీయ భాషా పుస్తక్ పథకం, ఐఐటీ సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించింది. అంతేగాక ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించడానికి రూ.20,000 కోట్లు వెచ్చించింది. ఇక, ఆర్జిఫిషియల్ ఇంటలిజెన్స్ పై దృష్టి సారించిన ప్రభుత్వం రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కేంద్రం విద్యా పద్ధతులు, పరిశోధనలలో ఏఐ వాడకాన్ని సులభతరం చేయనుంది.


Next Story

Most Viewed