- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Porn racket case: పోర్న్ రాకెట్ కేసు.. నటి శిల్పాశెట్టి భర్త కార్యాలయాల్లో ఈడీ సోదాలు
దిశ, నేషనల్ బ్యూరో: పోర్న్ రాకెట్ కేసులో(porn racket case) నటి శిల్పాశెట్టి (actor Shilpa Shetty)భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా(businessman Raj Kundra) నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. అశ్లీల చిత్ర నిర్మాణం, ప్రసారం కేసులో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుంద్రా నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం దాడులు చేపడుతోంది. అలానే, రాజ్ కుంద్రా సహచరులు, ఈ కేసుతో సంబంధం ఉన్న వారి నివాసాలపైనా ఈడీ దృష్టి పెట్టింది. ఇకపోతే, అశ్లీల చిత్రాలను నిర్మించారనే ఆరోపణలపై జూన్ 2021లో కుంద్రా అరెస్టు అయ్యారు. రెండు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత 2021 సెప్టెంబర్‌లో ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులో రాజ్ కుంద్రానే కుట్రదారుడు అని ముంబై పోలీసు అధికారులు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశఆరు. ముంబై పోలీసుశాఖకు చెందిన ప్రాపర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోగా అప్పట్లో ఈ వ్యవహారం బయటపడింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియలు తీస్తున్నట్లు గుర్తించారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన తర్వాత.. వాటిని వీట్రాన్స్‌ఫర్ ద్వారా విదేశాలకు ఆ కామెంట్‌ను పంపిస్తారు. అయితే భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాలను అక్కడి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను రాజ్‌కుంద్రా వద్ద పనిచేసేవాడు. ఉమేశ్ కామత్‌ను అరెస్టు చేసిన తర్వాతే.. ఆ పోర్న్ రాకెట్‌లో కుంద్రా పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు రాజ్ కుంద్రా ఫిల్మ్స్ సిబ్బందితో పాటు నటీనటులు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.