Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్.. ఈడీ విచారణకు అనుమతిచ్చిన కేంద్రం

by Shamantha N |
Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్.. ఈడీ విచారణకు అనుమతిచ్చిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కి షాక్ తగిలింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం(Excise Policy Scam Case) కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కేంద్రం అనుమతులిచ్చింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఈడీకి అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి ఇస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Delhi Lt. Governor VK Saxena) అనుమతి ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

గవర్నర్ కు ఈడీ లేఖ

అయితే, ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ (ED) ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) విచారణకు అనుమతి కోరుతూ గత నెల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ఈవిషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ (MHA) దృష్టికి తీసుకెళ్లింది. దీంతో, కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలోనే కేజ్రీవాల్ ను దర్యాప్తు అధికారులు విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఢిల్లీ మద్యం విధానంలో (Liquor scam case) అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2024 మార్చి 21న అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసి గతేడాది జూన్‌లో కస్టడీలోకి తీసుకుంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గత సెప్టెంబరులో బెయిల్‌ మంజూరైంది. ఇకపోతే, త్వరలోనే ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed