ఆప్‌కు వ్యతిరేకంగా ఈడీ సాక్షాలు సృష్టిస్తోంది: అమిత్ పాలేకర్ కీలక వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2024-03-26 07:22:12.0  )
ఆప్‌కు వ్యతిరేకంగా ఈడీ సాక్షాలు సృష్టిస్తోంది: అమిత్ పాలేకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవా అధ్యక్షుడు అమిత్ పాలేకర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై మండిపడ్డారు. ఆప్‌కు వ్యతిరేకంగా ఈడీ సాక్షాలు సృష్టిస్తోందని తెలిపారు. లిక్కర్ స్కాం డబ్బులు గోవా ఎన్నికల్లో ఉపయోగించుకున్నారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలూ లేవని చెప్పారు. మంగళవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. రాష్ట్రంలోని ఆప్ నేతలు ఎటువంటి విచారణను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు తమ కార్యకర్తల కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. కానీ ఆప్ శ్రేణులు స్వచ్చందంగా కష్టపడ్డారని చెప్పారు. ఆప్‌ను అణిచి వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వాటన్నింటినీ తిప్పి కొడుతామని తేల్చిచెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తయకు నమ్మకమైన కార్యకర్తలనే విస్మరించిందని విమర్శించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్‌కు అందిన డబ్బుల నుంచి కొంత సొమ్మును ఆ పార్టీ గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించుకుందని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ రెండు స్థానాల్లో గెలుపొందింది.

Advertisement

Next Story