- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress : కాంగ్రెస్‌కు ఈసీ నుంచి పిలుపు.. రీజన్ ఇదే..!
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న వచ్చి తమ సందేహాలు తెలపాలని ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీని శనివారం కోరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం ఈవీఎంలపై హస్తం పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులు బృందం వచ్చి తమ చట్టబద్ధమైన వాదనలు వినిపించాలని కోరింది. అభ్యర్థులు, పోలింగ్ బూత్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. నేరుగా వచ్చి తమ సందేహాలను తెలపాలని వాటికి రాతపూర్వకంగా బదులు ఇస్తామని ఈసీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ శుక్రవారం ఈసీకి ఫిర్యదు చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్‌ను తమ వాదనలను వినిపించాలని ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 230 సీట్లు గెలుచుకుంది. మహావికాస్ అఘాడీ కేవలం 46 సీట్లకు పరిమితమైంది.