సముద్ర గర్భంలోని ‘ద్వారక’ దర్శనానికి జలాంతర్గామి సర్వీసు..

by Vinod kumar |
సముద్ర గర్భంలోని ‘ద్వారక’ దర్శనానికి జలాంతర్గామి సర్వీసు..
X

గాంధీనగర్ : ద్వారక.. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన సుందర నగరం. ఇది అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో.. ద్వారకకు వెళ్లే భక్తులెవరూ దాన్ని చూడలేకపోతున్నారు. ద్వారకా నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్‌ ప్రభుత్వం జలాంతర్గామి సేవలను త్వరలో ప్రారంభించనుంది. ఈ ఏర్పాట్లను చేసేందుకు ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజగావ్‌ డాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 24 మంది యాత్రికులను జలాంతర్గామిలో అరేబియా సముద్ర గర్భంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్లి ద్వారకను చూపిస్తారు. జలాంతర్గామిలో పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్‌, గైడ్‌ కూడా ఉంటారు.


Next Story