- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘హిట్ అండ్ రన్’ కేసులో శిక్ష పెంపుపై డ్రైవర్లు భగ్గు.. ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర సర్కారు తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా అప్పుడే నిరసనలు మొదలయ్యాయి. హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకు విధించే శిక్షను రెండేళ్ల నుంచి పదేళ్లకు పెంచడాన్ని ఖండిస్తూ ఢిల్లీ, హరియాణా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో లారీ, ప్రైవేటు బస్ డ్రైవర్లు జాతీయ రహదారులను నిర్బంధించారు. డ్రైవర్ల సంఘాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, భారత న్యాయ సంహిత చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.
పాత చట్టం వర్సెస్ కొత్త చట్టం
పాత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష విధించేవారు. కొత్తగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో పదేళ్లు జైలు శిక్ష, రూ.ఏడు లక్షల జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు. ఇలాంటి రూల్స్ వల్ల కొత్త వారు డ్రైవింగ్ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘‘ఉద్దేశపూర్వంగా యాక్సిడెంట్ చేయాలని ఏ డ్రైవర్ కూడా అనుకోడు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి స్వయంగా తరలిస్తే.. మూక దాడి జరిగే ముప్పు ఉంటుందనే భయంతో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్నిసార్లు పొగ మంచు కారణంగా ప్రమాదాలు జరుగుతాయి. అందుకే డ్రైవర్‌కు పదేళ్ల జైలు విధించడం సరికాదు’’ అని డ్రైవర్ల సంఘాల నాయకులు అంటున్నారు.