- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎగ్జామ్ సెంటర్‌లో లో దుస్తుల తనిఖీలు..!
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల(మే) 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నీట్ డ్రెస్ కోడ్ గురించి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, మహారాష్ట్రలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద అమ్మాయిల దుస్తులను దారుణంగా చెక్ చేశారట. లో దుస్తులను, చివరకు హుక్స్ తీసి తనిఖీ చేశారని విద్యార్థులు వాపోయారు. అలాగే ఓ అమ్మాయి జీన్స్ ధరించి ఎగ్జామ్ సెంటర్‌కు వస్తే ఆమెను అనుమతించలేదట. ఆ అమ్మాయి తల్లిదో ఇతరులదో డ్రెస్ ఛేంజ్ చేసుకొని రమ్మన్నారట. కొంతమంది సమీపంలో ఉన్న షాపుల్లో అప్పటికప్పుడు కొనుక్కోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ విద్యార్థి అక్కడ జరిగినవన్నీ నేరుగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కొంతమంది బాయ్స్ డ్రెస్సులు కొనడానికి సమయం లేదని ఇన్నర్ మాత్రమే ధరించి పరీక్ష రాయాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు.. ప్యాంట్లకు ఎక్కువగా జేబులు ఉండడం వల్ల బట్టలు ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.