సైఫ్ అలీ ఖాన్‌పై నిజంగా దాడి జరిగిందా?

by Ajay kumar |
సైఫ్ అలీ ఖాన్‌పై నిజంగా దాడి జరిగిందా?
X

- ఆ గాయాలు నిజం కాదేమో

- మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే సంచలన వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో:

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి నిజం కాకపోవచ్చు. అగంతకుడి దాడిలో సైఫ్ అలీ ఖాన్ నిజంగా గాయపడ్డాడంటే నమ్మలేకుండా ఉన్నాను. ఆయనకు కలిగిన గాయాలు నిజమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయని మహారాష్ట్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి నితేశ్ రాణే ఆరోపించారు. లీలావతి ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయిన తర్వాత బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 'ఈ బంగ్లాదేశీయులు ముంబైలో ఏం చేస్తున్నారో చూడండి. ఇంతకు ముందు వాళ్లు రోడ్ల కూడలిలో నిలబడి అడుక్కునే వారు. కానీ ఇప్పుడు వాళ్లు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించారు. బహుషా అతడిని తమతో పాటు తీసుకెళ్లడానికి వచ్చారేమో. అదే నిజమైతే చాలా మంచిది. ఇలాంటి చెత్తను తీసుకొని పోవాల్సిందే. సైఫ్అలీ ఖాన్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పటి దృశ్యాలను చూశాను. అతడిపై నిజంగా కత్తితో దాడి జరిగిందా లేదా నటిస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. అతను చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ నడుస్తున్నాడు. ప్రతీ ఒక్కరు ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు' అని నితీష్ రాణే వ్యాఖ్యానించారు.

'హిందూ మతానికి చెందిన నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను వేధింపులకు గురి చేసినప్పుడు ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి మాట్లాడారా? ముంబైకి చెందిన జితేంద్ర అవ్‌హాద్, బారామతికి చెందిన సుప్రియా సూలే కనీసం ముందుకు వచ్చిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ సైఫ్ అలీ ఖాన్, షారుఖ్ ఖాన్ కొడుకు, నవాబ్ మాలిక్ వంటి వారి కోసం మాత్రం చాలా ఆందోళన పడుతున్నారు. మీరెప్పుడైనా వాళ్లు హిందూ నటుల కోసం ఆందోళన పడటం చూశారా.. మీరు ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది' అంటూ నితీష్ రాణా ఆరోపణలు గుప్పించారు. కాగా నితీష్ రాణే వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. 'నాకు ఆయన వ్యాఖ్యల గురించి తెలియదు. ఒక వేళ అలా మాట్లాడి ఉంటే, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలైనా ఉంటే హోం శాఖను సంప్రదించాలి' అని అజిత్ పవార్ సూచించారు.



Next Story

Most Viewed