- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీ ఆదేశాల మేరకు లాటరల్ ఎంట్రీ ప్రకటనను రద్దు చేయాలని.. యుపీఎస్‌సీ ఛైర్మన్‌కు లేఖ రాసిన డిఓపిటి మంత్రి
దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ఉన్నత స్థాయి ఉద్యోగాలు యూపీఎస్సీ తో సంబంధం లేకుండా.. లెటరల్ ఎంట్రీ లకు నీతి ఆయోగ్ సూచనల మేరకు కేంద్రం జారీ చేసింది. ఈ విధానం దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఎన్డీయే ప్రభుత్వ నేతలు కూడా రిజర్వేషన్లను కొనసాగించాలని.. ఈ లెటరల్ ఎంట్రీతో రిజర్వేషన్లను అనిచివేయడమే అని ఆరోపణలు చేశారు. అలాగే పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఈ లెటరల్ ఎంట్రీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం యూసీఎస్సీని ఆర్ఎస్ఎస్ తో నింపాలని చూస్తొందని విమర్శించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ఈ క్రమంలో 45 మంది నిపుణుల కోసం విడుదల చేసిన లెటరల్ ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) చైర్మన్ ప్రీతి సూదన్‌కు లేఖ రాశారు. ఇందులో 45 మంది స్పెషలిస్ట్‌ల పార్శ్వ ప్రవేశాన్ని కోరుతూ విడుదల చేసిన ప్రకటనను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ "పార్శ్వ ప్రవేశ ప్రక్రియ సమానత్వం, సామాజిక న్యాయం, ముఖ్యంగా రిజర్వేషన్ల నిబంధనలకు సంబంధించిన సూత్రాలకు అనుగుణంగా ఉండాలని దృఢంగా విశ్వసిస్తున్నారని" లేఖలో సింగ్ పేర్కొన్నారు.