ఏక్‌నాథ్ షిండే హమాస్ ఉగ్రవాది : Sanjay Raut

by Vinod kumar |   ( Updated:25 Oct 2023 11:32 AM  )
ఏక్‌నాథ్ షిండే హమాస్ ఉగ్రవాది : Sanjay Raut
X

ముంబై : ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండేలకు చెందిన శివసేన గ్రూపుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే టార్గెట్‌గా తాజాగా శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్‌ విరుచుకుపడ్డారు. ‘‘మేం హమాస్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలతో చేతులు కలుపుతామని ఏక్‌నాథ్ దారుణమైన ఆరోపణలు చేశారు. ఏక్‌నాథ్ షిండే ఒక హమాస్ ఉగ్రవాది. షిండే బుర్రలో బీజేపీ ఎంతగా విషాన్ని, విద్వేషాన్ని నూరిపోసిందో ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి అర్థమైపోతోంది’’ అని ఆయన విమర్శించారు. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉద్ధవ్ థాక్రే గ్రూప్ ఉగ్ర సంస్థలతో చేతులు కలిపేందుకూ వెనుకాడదని ఏక్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed