Chalapati encounter: భార్యతో దిగిన సెల్పీనే పట్టించిందా? చలపతి పోలికల వెనుక సంచలన విషయాలు

by Prasad Jukanti |
Chalapati encounter: భార్యతో దిగిన సెల్పీనే పట్టించిందా? చలపతి పోలికల వెనుక సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతితో పాటు 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పుల్లో రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి (Chalapati Encounter) ఎన్ కౌంటర్ వెనుక తన భార్యతో సెల్పీ ఫోటో కోణం వైరల్ గా మారింది. ప్రస్తుతం 62 ఏళ్లు ఉన్న చలపతి యువకుడిగా ఉన్న సమయంలో మావోయిస్టుల్లో (Maoist Party) చేరి అడవి బాట పట్టారు. పలు సంచలన ఆపరేషన్లలో సూత్రధారిగా ఉన్న చలపతి ప్రస్తుత రూపురేఖలు ఎలా ఉన్నాయి? అతడి పోలికలు ఏమిటి అనేది పోలీసులకు మిస్టరీగా మారింది. ఈ క్రమంలో చలపతి తన భార్య అరుణతో (Aruna) దిగిన ఓ సెల్పీ పోలీసులకు లీడ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2016 మే లో ఏపీలోని అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్ పోన్ పోలీసులకు దొరికింది. దాంట్లోని సమాచారాన్ని విశ్లేషిస్తుండగా చలపతి తన భార్యతో తిగిన సెల్పీ కనిపించింది. ఈ ఫోటోలో ఉన్న చలపతి రూపురేఖలను భద్రతదళాలకు తెలిసిపోయింది. తన రూపురేఖలు పోలీసులకు తెలిసిపోయిందని తెలుసుకున్న చలపతి అప్రమత్తమయ్యారు. ఎక్కడికి వెళ్లినా తన వెంట దళాలను రక్షణగా తీసుకువెళ్లేవారు. ఈ క్రమంలో గత సోమవారం తన టీమ్ తో కలిసి వెళ్తుండగా జరిగిన ఎన్ కౌంటర్ లో చలపతి ప్రాణాలు కోల్పోయారు. సెల్పీలో ఉన్న ఫోటో అక్కడ చనిపోయిన వారిలోని ఒకరి మొహం ఒకేలా ఉండటంతో అతడు చలపతి అని పోలీసులు నిర్థారించుకున్నట్లు తెలుస్తోంది.

Next Story