- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డీఎంకే నుంచి శివాజీ కృష్ణమూర్తి సస్పెన్షన్.. అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: మహిళలను కించపరిచేలా మాట్లాడిన డీఎంకే స్పోక్స్ పర్సన్ శివాజీ కృష్ణమూర్తిపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో శివాజీ కృష్ణమూర్తి సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ పాత పాత్ర అంటూ అవహేళనగా మాట్లాడారు. దీంతో బీజేపీ శ్రేణులు, మహిళా సంఘాలు శివాజీ వ్యాఖ్యలను ఖండించాయి. మహిళలను అవమానించేలా డీఎంకే నేత మాటలు ఉన్నాయని మండిపడ్డారు. తక్షణమే సీఎం స్టాలిన్ స్పందించి అతడిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇక ఖుష్బూ మాట్లాడుతూ.. శివాజీ కృష్ణమూర్తి తనను మాత్రమే కాదని సీఎం స్టాలిన్, మాజీ సీఎం కరుణానిధిని కూడా అవమానించారని అన్నారు. ఈ విషయంలో సీఎం స్టాలిన్ స్పందించకపోవతే ఆయన దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారని అనుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ అన్నింటి నేపథ్యంలో పార్టీ నుంచి శివాజీ కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. అదే విధంగా టీఎన్ గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు ఖుష్బూ సుందర్‌లపై శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలపై కొడుంగయ్యూర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.