సీఎం ఎంపికలో తీవ్ర ఉత్కంఠ.. ఖర్గే ప్రతిపాదనకు నో చెప్పిన డీకే శివకుమార్..!

by Javid Pasha |   ( Updated:2023-05-15 05:22:12.0  )
సీఎం ఎంపికలో తీవ్ర ఉత్కంఠ.. ఖర్గే ప్రతిపాదనకు నో చెప్పిన డీకే శివకుమార్..!
X

దిశ, వెబ్ డెస్క్: 136 సీట్లతో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా సీఎం అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి కత్తిమీద సాములా తయారైంది. సీఎం పోస్టు కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, అక్కడి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సీఎం ఎంపిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ సమావేశమైన సీఎల్పీ సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పచెబుతూ ఏక వాక్య తీర్మానం చేసింది. దీన్ని ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఖర్గే సీఎం పోస్టు విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందు ఓ ప్రతిపాదనను పెట్టినట్లు సమాచారం. చెరో రెండున్నరేళ్లు సీఎం పోస్టు బాధ్యతలు తీసుకోవాలని ఖర్గే వారిని కోరినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఓకే చెప్పగా.. డీకే శివకుమార్ మాత్రం తిరస్కరించినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య ఇప్పటికే ఓ దఫా సీఎంగా చేశారని, ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ ఖర్గేతో చెప్పినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబట్టడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి నేతలను రేపు ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. సీఎం పోస్టు విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లను ఒప్పించేందుకు ఖర్గేతో పాటు సోనియా, రాహుల్ గాంధీ ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read More: రైళ్ల హాల్టింగ్‌కు అనుమతివ్వండి.. రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Advertisement

Next Story