Dk shiva kumar: ప్రధాని మోడీతో డీకే శివకుమార్ భేటీ..కర్ణాటక సమస్యలపై డిస్కషన్

by vinod kumar |
Dk shiva kumar: ప్రధాని మోడీతో డీకే శివకుమార్ భేటీ..కర్ణాటక సమస్యలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని మోడీని కోరారు. బెంగళూరును గిఫ్ట్ సిటీ తరహాలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులపై మోడీతో చర్చించినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్న నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉందన్నారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో మాత్రం నగరానికి ఎటువంటి కేటాయింపులు జరగలేదన్నారు. లక్షలాది మంది ప్రజలు బెంగళూరుకు వస్తున్నందున బెంగళూరుకు మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎగువ భద్ర ప్రాజెక్టుపై, గత బడ్జెట్‌లో రూ. 5,300 కోట్లు కేటాయించినప్పటికీ కేంద్రం ఎలాంటి నిధులను విడుదల చేయలేదన్నారు. ఈ విషయం మోడీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.

Next Story

Most Viewed