- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: వారసత్వ పన్ను ప్రకటనపై శ్యామ్ పిట్రోడా క్లారిటీ
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వారసత్వ పన్ను ప్రకటనపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై శ్యామ్ తాజాగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని తెలిపారు. దేశంలోని ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని ప్రచారం చేస్తున్న అబద్దాల నుంచి దృష్టి మళ్లించడానికి యూఎస్‌లో వారసత్వ హక్కును ఉదహరించానని, దీనిని మోడీ మీడియా వక్రీకరించడం దురదృష్టకరమని ఎక్స్‌లో పేర్కొన్నారు.
శ్యామ్ పిట్రోడా ఏం చెప్పారు?
ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో భాగంగా శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ..సంపద పున:పంపిణీకి సంబంధించిన అమెరికాలోని ఓ పద్దతిని ఉదహరించారు. ‘యూఎస్‌లో వారసత్వపు పన్ను ఉంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఆస్తిలోని 55శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మిగిలిన 45 శాతాన్ని తమ వారసులకు తిరిగి పంపిణీ చేస్తారు. ఇది ఒక ఆసక్తి కరమైన చట్టం. ఇది నాకు ఎంతో న్యాయంగా అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఈ వ్యవస్థలేదని.. దీని గురించి ప్రజలు ఆలోచించాలని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేయాలను కుంటుందని ఆరోపించింది. ప్రజలు కష్టపడి సంపాదించిన పన్ను చెల్లింపుదారుల వనరులను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోందని పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తెలిపారు. ‘వ్యాపారవేత్త అయితే 55శాతం తీసుకుంటారు, అలాగే రైతు మరణిస్తే కూడా అతని భూమిలో 55శాతం తీసుకుంటారా. ఈ వ్యత్యాసానికి చాలా తేడా ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. శ్యామ్ వ్యాఖ్యలు తన వ్యక్తి గత అభిప్రాయాలని, దానితో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.