- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Delhi HC: మహిళలు నిర్భయంగా తిరగడమే నిజమైన సాధికారత- ఢిల్లీ హైకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా తిరిగే హక్కు కలిగి ఉండటమే నిజమైన సాధికారత అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాలను మహిళలకు అసురక్షితంగా మార్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వేధింపులు లేని, సురక్షిత, నిర్భయ వాతావరణం సృష్టించకపోతే మహిళల పురోగతిపై జరిగే చర్చలన్నీ పైపైనే అని వెల్లడించింది. 2015లో పబ్లిక్ బస్సులో మహిళను లైంగికంగా వేధించినందుకు ట్రయల్ కోర్టు వ్యక్తిని దోషిగా తేల్చింది. అతడికి ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధించింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పుపై దోషి సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. అక్కడ కూడా అతడికి చుక్కెదురైంది. దీంతో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. కాగా.. కింది కోర్టు తీర్పుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పుని వెలువరించారు. ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోలేమన్న కోర్టు.. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా మహిళలు వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారనే విషయంపై విచారం వ్యక్తం చేసింది. ప్రజారవాణాయే బాధితురాలికి దుర్బల ప్రదేంగా మారిందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దోషిపై దయ చూపిస్తే.. నేరస్థులకు ధైర్యం ఇచ్చినట్లే అని పేర్కొంది.