Ram Setu:రామసేతు అసలు రూపం చెప్పడం కష్టతరమే: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

by S Gopi |   ( Updated:2022-12-23 12:44:09.0  )
Ram Setu:రామసేతు అసలు రూపం చెప్పడం కష్టతరమే: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
X

న్యూఢిల్లీ: రామసేతు‌పై పార్లమెంటులో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎంపీ కార్తీకేయ శర్మ రాజ్యసభలో లేవనెత్తిన అంశంపై కేంద్రం సమాధానమిచ్చింది. 'నిజమైన రామసేతు అసలు రూపం అక్కడ ఉందనే విషయం చెప్పడం కష్టంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ నిర్మాణం ఉందని చెప్పడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి' అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత చరిత్రపై ప్రభుత్వం ఏమైనా శాస్త్రీయ పరిశోధనలు చేస్తుందా అని హర్యానా ఎంపీ ప్రశ్నించారు. అయితే ఈ వారధి 18 వేల ఏళ్ల నాటి చరిత్ర అని చెప్పడానికి ఆధారాలున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ బ్రిడ్జి పొడవు 56 కిలోమీటర్లకు పైనే ఉందని తెలిపారు. అయితే స్పేస్ సాంకేతిక ద్వారా సముద్రంలో వరుసలో ఉన్న రాళ్లను గుర్తించామని చెప్పారు. ఇలాంటి ప్రాచీన చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం పనిచేస్తున్నదని చెప్పారు. తాజా వ్యాఖ్యలతో మోడీ ప్రభుత్వం రామసేతు ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు.

Advertisement

Next Story